మన ధ్యాస న్యూస్
కొత్తపట్నం మండలంలో సమాచార హక్కు చట్టం వచ్చి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సామాజిక సహోద్యామ వేదిక కార్యదర్శి గడ్డం అమృతపాణి మాట్లాడుతూ ఈ చట్టం సామాన్యులకు వజ్రాయుధం లాంటిది ఈ చట్టం ద్వారా గ్రామస్థాయిలో సమాచారం ఉచితంగా అందించాలి మనదేశంలో అత్యంత విలువైనది ఓటు దాని తర్వాత అంత విలువైనది సమాచార హక్కు చట్టం అని చెప్పడం జరిగింది. పసుమర్తి ప్రసాద్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఈ చట్టం గురించి తెలుసుకోవాలని ఈ చట్టం అంటే అవినీతి అధికారులకు వెన్నులో వణుకు పుడుతుంది గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయంలో ఏం జరుగుతుందని ప్రతి ఒక్కరు తెలుసుకోవచ్చని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో పాదర్తి శివ, మోష, జి అనిల్, కే ప్రభు కుమార్, ఎం బాలాజీ, బి సతీష్ మొదలైన వారు పాల్గొన్నారు.







