తిరుపతి,మన ధ్యాస : సీనియర్ పాత్రికేయులు ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షులు శివమూర్తి ను లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో ఘనంగా సన్మానించారు. ఆదివారం తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో భారతీయ సాంస్కృతిక ఉత్సవం 2025లో భాగంగా జరిగిన వే ఫౌండేషన్ 12వ వార్షికోత్సవ వేడుకలను ఫౌండర్ చైర్మన్ డాక్టర్ పైడి అంకయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జర్నలిజంతో పాటు ఉత్తమ సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు సీనియర్ పాత్రికేయులు శివ మూర్తి ని మెమొంటో అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శివమూర్తి మాట్లాడుతూ వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ పైడి అంకయ్య సేవలను కొనియాడారు. సమాజసేవకులను గుర్తించి ఉత్తమ పురస్కారాలు అందజేయడంతో వారు మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిమిక్రీ విజయ్ కుమార్, నల్ల రాధాకృష్ణ, ఎంపీ ప్రసాద్, లింగుట్ల రమేష్ నాథ్, రాష్ట్రంలోని ప్రముఖులు, జర్నలిస్టుల, స్వచ్ఛంద సేవ సంస్థ నిర్వాహకులు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.







