ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాత్రి వేళల్లో ప్రజానీకంపై దోమలు దండయాత్ర చేస్తున్నాయి. దీంతో ప్రజలు దోమ కాటుకు గురై విష జ్వరాల వారిన పడుతున్నారు. సాయంత్రం 6 గంటల్లో అయిందంటే చాలు బయటకు రావాలంటేనేభయపడిపోతున్నారు. దోమలు ముక్కుమ్మడిగా దాడి చేస్తున్నాయి. ఖాళీ స్థలాలు.. పేరుకుపోయిన చెత్త చెదారం… డ్రైనేజీ కాలువలు వాటి పునరుత్పత్తికి కేంద్రాలుగా తయారయ్యాయి. దీంతో డ్రైనేజీ కాలువలో దోమలకు ఆవాసాలుగా తయారయ్యాయి. వాటి ద్వారా ప్రజలు విశ జ్వరాల బారిన పడుతున్నారు. పట్టణంలో దోమల నివారణలో , పారిశుద్ధ్యం లో నివారణలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఎన్నోసార్లు అధికారులకు తెలియజేసినప్పటికీ తమకు ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్న పంచాయతీ అధికారులు. ఇప్పటికైనా మా కాలనీలో పేరుకొని పోయి ఉన్న చెత్తను, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ కాలువలను, శుభ్రం చేసి దోమల నుండి, విష జ్వరాల బారి నుండి మమ్మలను మా పిల్లలను కాపాడాలని వేడుకుంటున్న కాలనీవాసులు.








