చిత్తూరు, మనధ్యాస, అక్టోబర్ 12

కట్టమంచి హరిణి రెడ్డి జన్మదినం సందర్భంగా ఉదయం వారి స్వగ్రామం నందు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన రెడ్డి జేఏసీ కుటుంబ సభ్యులు. తదనంతరం గవర్నమెంట్ హాస్పిటల్ నందు సుమారు 50 మందికి ప్రసవించిన తల్లులకు, బిడ్డలకు కిట్లను అందించడం జరిగినదని, అలాగే వైయస్సార్ పార్టీ కట్టమంచి 5వ వార్డు కార్పొరేటర్ గా ఎనలేని సేవలు అందిస్తున్న హరిణి రెడ్డి కి వైయస్సార్ పార్టీ ఇంచార్జ్ విజయనంద రెడ్డి మరియు వైఎస్ఆర్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తదనంతరం ఈరోజు సాయంత్రం హరిణీ రెడ్డి మాట్లాడుతూ నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన, శ్రేయోభిలాషులకు, పార్టీ నాయకులకు,, ప్రత్యక్షంగా, పరోక్షంగా మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.








