మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వడ్డేపల్లి,మల్లూర్,సుల్తాన్ నగర్,వెల్గనూర్ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ ..జుక్కల్ నియోజకవర్గానికి గర్వకారణం సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో రాష్ట్రంలోనే ముందంజలో జుక్కల్ ఉందన్నారు.జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ప్రజల ఆరోగ్యం,సంక్షేమం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అత్యధికంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేయడంలో రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని సంపాదించారు అని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు ప్రజాపండరి, బ్రహ్మం,హుస్సేని,తదితరులు ఉన్నారు.






