చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె మండలానికి చెందిన నక్కల ప్రతాప్ రెడ్డిని చిత్తూరు జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులుగా నియమించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కమలపతి రెడ్డి మాట్లాడుతూ “రెడ్డి కమ్యూనిటీ అభివృద్ధి కోసం, విద్య, ఉపాధి, సేవా కార్యక్రమాలు, సామాజిక సంక్షేమం కోసం సమష్టిగా కృషి చేస్తానని” తెలిపారు. రెడ్డి కమ్యూనిటీ అభ్యున్నతి, యువతకు ప్రోత్సాహం, మరియు సమాజంలో ఐక్యత బలోపేతం దిశగా పనిచేయాలని ఆయన సంకల్పం వ్యక్తం చేశారు. ఈ నియామకంపై జిల్లా, మండల స్థాయి సభ్యులు మరియు కమిటీ ప్రతినిధులు అభినందనలు తెలిపారు. నూతన జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు గా ఎన్నికైన ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ నిబంధనలకు అనుగుణంగా మన రెడ్ల ఐక్యత కోసం పాటుపడేందుకు తన వంతు శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను అని తెలిపారు. నా పై నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చిన రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు







