తుఫాను నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి.,,,మొంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో – దుప్పట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
కలిగిరి అక్టోబర్ 28 :(మన ద్యాసన్యూస్)://

గత కొన్ని రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాలలో కురిసిన వర్షాలు, నిన్న రాత్రి నుండి మొంథా తుఫాన్ ప్రభావంతో వీచిన ఈదురు గాలులు, భారీ వర్షాలు ప్రజల జీవితాలను దెబ్బతీశాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలో నీరు నిల్వ ఉండటంతో పాటు వాతావరణంలో చలి తీవ్రంగా పెరగడంతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని గమనించిన ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ ప్రజల పట్ల తమ హృదయపూర్వకమైన మానవతా దృక్పథాన్ని మరోసారి చాటుకున్నారు.ప్రజల బాధను అర్థం చేసుకొని, స్వయంగా రంగంలోకి దిగిన ఎమ్మెల్యే కలిగిరి మండల కేంద్రంలోని టుబాకో బోర్డు ఎస్టీ కాలనీలోని సుమారు 100 కుటుంబాలకు దుప్పట్లు, ఆహార పదార్థాలు, తినుబండారాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ – “

ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలబడటం నా బాధ్యత. ప్రభుత్వం తరఫున, వ్యక్తిగతంగా కూడా అవసరమైన సహాయం అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను” అని తెలిపారు. అంతేకాకుండా నియోజకవర్గ ప్రజలందరూ తుఫాను నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సహాయం కొరకు ఎల్లవేళలా నేను అందుబాటులో ఉంటానని తెలిపారు.

ఈ సేవా కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఈ సేవా తపనను, మానవతా దృక్పథాన్ని ప్రశంసిస్తూ స్థానికులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. వారు మాట్లాడుతూ – “ప్రతి సందర్భంలో ప్రజల పక్కన నిలబడి, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించే మన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నిజమైన ప్రజానాయకుడు” అని అభిప్రాయపడ్డారు.







