తవణంపల్లి అక్టోబర్ 27 మన ద్యాస
తవణంపల్లి మండలంలోని జొన్న గురుకుల పంచాయతీ పరిధిలోని జొన్న గురుకుల గ్రామ ప్రాథమిక పాఠశాల, ఎదురుగా నిరుపయోగంగా శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనం కారణంగా విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.
బారివర్షాల కారణంగా భవనం మరింత దెబ్బతినే ప్రమాదం ఉండటంతో, గ్రామ సర్పంచ్ సరితా రాజశేఖర్ రెడ్డి, సెక్రటరీ రామరాజు, ప్రధానోపాధ్యాయిని వరలక్ష్మి, అలాగే మండల విద్యా శాఖ అధికారిణి హేమలత వెంటనే స్పందించారు.
జేసీబీ సహాయంతో పాడైన భవనాన్ని చదును చేసి, విద్యార్థుల భద్రత కోసం అవసరమైన చర్యలు చేపట్టారు.
అధికారుల సత్వర స్పందనతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
విద్యార్థుల భవిష్యత్తు కోసం గ్రామ పెద్దల ఈ చొరవ ప్రశంసనీయమని పలువురు అభిప్రాయపడ్డారు.







