తిరుపతి, మన ధ్యాస: తల్లి తండ్రులు పిల్లల్లో శీల నిర్మాణం ద్వారా సమాజాన్ని రక్షించాలని సైకాలజిస్ట్ డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి పిలుపు నిచ్చారు. సోమవారం ఎస్ ఓ ఎస్ పిల్లల గ్రామంలో పిల్లల శీల నిర్మాణంలో తల్లుల పాత్రపై అవగాహన కల్పించారు. ఆధునిక సమాజంలో నైతిక విలువలు క్షీణించడం వల్ల అవినీతి, అక్రమాలు, లంచగొండితనం, అసాంఘిక కార్యకలాపాలు పెరిగి పోయాయన్నారు. కొందరు యువకులు వ్యసనాలకు బానిసలై సమాజానికి హాని చేస్తున్నారన్నారు. కొందరు ఉద్యోగుల్లో లంచగొండి తనం పెరిగిపోయి సామాన్యులను దోచుకుంటున్నారని చెప్పారు. కొన్ని సామాజిక వ్యవస్థల్లో అక్రమాలు పెరిగి పోతున్నాయని చెప్పారు. ఇలాంటి వారంతా ఒక తల్లి కన్న పిల్లలే అన్నారు. బాల్యం నుంచి విలువల నేర్పక పోవడమే ఇందుకు కారణం అన్నారు. తల్లి చెప్పిన రామాయణం విని, భగవద్గీత చదివి గాంధీ దేశానికి స్వతంత్రం చేసారని చెప్పారు. ఇప్పటి తల్లులు కథలు చెప్పడం, విలువలు నేర్పడం తగ్గిపోయిందన్నారు. దీని వల్ల పిల్లల్లో సమగ్ర వ్యక్తిత్వం నిర్మాణం కాలేదన్నారు. కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం పరిశీలిస్తే దారి తప్పు తున్న ప్రమాణాలు దర్శనమిస్తాయి చెప్పారు. పతనం అవుతున్న విలువలకు అద్దం పడుతోందన్నారు. ఈ నేపథ్యంలో తల్లి తండ్రులు బాల్యం నుంచే పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం, సామాజిక స్పృహ పట్ల శ్రద్ధ చూపాలని కోరారు. కార్యక్రమంలో లోకల్ ఇంచార్జి వి సత్యనారాయణ, కో వర్కర్ టి మునిరత్నం, సమీప గ్రామాల మహిళలు పాల్గొన్నారు.







