మన ధ్యాస,పొదలకూరు, అక్టోబర్ 26: పొదలకూరులో లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ పొదలకూరు సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా వైద్యశిబిరం జరిగింది.ఈ శిబిరాన్ని నారాయణ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్ వైద్య సహకారంతో నిర్వహించినారు.ఈ వైద్య శిబిరం 26-10-2025 (ఆదివారం) న ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కన్యాకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, పొదలకూరులో నిర్వహించినారు.ఈ శిబిరంలో ఉచిత కంటి పరీక్షలు, దంత పరీక్షలు, గైనిక్, ఆర్థో, బి.పీ, షుగర్ తదితర పరీక్షలు నిర్వహించబడినాయి.ప్రతి విభాగానికి నారాయణ హాస్పిటల్ నిపుణులు హాజరై వైద్య సేవలు అందించినారు.కంటి పరీక్షల్లో భాగంగా అర్హులైన వారికి ఉచితంగా కళ్ళజోడులు అందజేస్తారు. అదేవిధంగా అవసరమైతే కంటి ట్రిట్‌మెంట్ కోసం నారాయణ ఐ హాస్పిటల్‌లో ఉచిత చికిత్స అందించే ఏర్పాట్లు చేశారు.దంత పరీక్షల్లో భాగంగా నిపుణులు ఉచితంగా దంత పరిశీలన చేసి అవసరమైన సూచనలు అందించినారు. ఇతర వైద్య విభాగాల నిపుణులు కూడా ప్రజలకు అవగాహన కల్పించినారు.ఈ శిబిరానికి డా. కృష్ణమూర్తి (ఆర్థోపెడిక్), ఎల్. శ్రీనివాసులు, ఎల్. డా. ఆర్.వి.యస్. కృష్ణకుమార్ (ఎం డి ఎస్, గైడ్ స్పెషలిస్ట్) తదితర నిపుణులు హాజరైనారు.ఈ కార్యక్రమానికి జాలీ వాకర్స్ క్లబ్, వి ఆర్ సి నెల్లూరు సహకారం అందించినది.ఈ కార్యక్రమం నిర్వాహకులు : ఎం జె ఎఫ్ లయన్. పి. అంజనేయులు (ప్రెసిడెంట్), లయన్ వి శ్రీధర్ (ప్రెసిడెంట్) లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు ;లయన్ ఎం రామకృష్ణ (సెక్రటరీ) ; లయన్ ఎం వెంకటేశ్వర్లు ( ట్రెజరర్ ) లయన్ మధుసూదన్ (ప్రెసిడెంట్) లయన్స్ క్లబ్ ఆఫ్ పొదలకూరు మరియు లయన్స్ క్లబ్ సభ్యులు.










