మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. బుధవారం డోంగ్లీ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మండలానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద చెక్కులను ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఆడపిల్లల పెళ్లిళ్లకు మేమున్నాం.పేదింటి ఆడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకాలను నిబద్ధతతో అమలు చేస్తోంది అని పేర్కొన్నారు.ప్రజా ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని,ఈ పథకాలు నిలువెత్తు నిదర్శనమని తెలిపారు.అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా సన్న బియ్యం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని, దాంతో పేద కుటుంబాలు మూడు పూటలా కడుపు నిండా భోజనం చేసేందుకు వీలవుతోందని సంతోషం వ్యక్తం చేశారు.ప్రతి పేదింటిలో సంక్షేమ కాంతులు నింపాలన్నదే ప్రజా ప్రభుత్వ ధ్యేయం అని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాయి పటేల్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.








