మనధ్యాస,నిజాంసాగర్(జుక్కల్): సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుతో పేదోడి సొంతింటి కల నిజమవుతుందని నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్నారు. సోమవారం సుల్తాన్ నగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటికి ప్రారంభోత్సవం నిర్వహించారు.ఇందిరమ్మ పథకం కింద ఇంటి నిర్మాణం చేపట్టిన పర్వయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లి కార్జున్ ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకున్న వాళ్లకి ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూడడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు కుర్మ సాయిలు, బ్రహ్మం,హుస్సేన్, తదితరులున్నారు.








