కలిగిరి, అక్టోబర్ 17 :(మన ధ్యాస న్యూస్ ):///

సుప్రీంకోర్టు ర్టు ప్రధాన న్యాయమూర్తి బి ఆర్ గవాయి పై దాడిని ఖండిస్తూ దాడిచేసిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ MRPS వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు, కలిగిరి మండలం ఎమ్ ఎస్ పి మండల ఇంచార్జి బొర్రా వెంగళరావు మాదిగ ఆధ్వర్యంలో కలిగిరి తహసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా, ఎమ్ ఎస్ పి, నెల్లూరు జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగ హాజరై, ఈనెల 6న బిఆర్ గవాయి గారిపై చెప్పుతో దాడి చేసినటువంటి రాకేష్ కిషోర్ ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, ఈ దాడి పై సమగ్ర విచారణ జరిపి దాడికి సంబంధించిన వారందరినీ శిక్షించాలని ఇలాంటి సంఘటనలు మరల పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఈ చర్య హేమమైన చర్య అని ఇది గవాయి పై జరిగిన దాడు కాదని న్యాయ వ్యవస్థ పైన భారత రాజ్యాంగంపై జరిగిన దాడిగా భావించి యావత్ భారతదేశం దీనిని ఖండించాలని పిలుపునిచ్చాడు. అనంతరం తహసిల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ కి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో MMS జిల్లా నాయకురాలు మంద సుజాత మాదిగ,కూనిపోగు యిర్మీయా మాదిగ, మల్లెల తిరుమలేష్ మాదిగ, ఎలికా మాలకొండయ్య, శ్రీరాం మాలకొండయ్య, కూనిపోగు నాగేశ్వరరావు, మొద్దు మస్తాన్,రోడ్డా బాబు, కర్రా శాంయేలు, గంగపట్ల రవీంద్ర, కలిగిరి మండలం ఎమ్ఆర్పిఎస్, -ఎమ్ ఎస్ పి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.








