మన ధ్యాస,నిజాంసాగర్: ( జుక్కల్ ) బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని విశ్రాంత గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కాశీనాథ్ దేశాయ్ తెలిపారు.
శనివారం పెద్ద కొడపగల్ మండల కేంద్రంలో బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా,బంద్ కార్యక్రమాలలో పాల్గొని ఆయన ప్రసంగించారు..
తెలంగాణ సాధన కోసం ఎలాగైతే అన్ని వర్గాలు ఏకమై పోరాడి రాష్ట్రం సాధించుకున్నామో,అదే ఉత్సాహంతో బీసీ రిజర్వేషన్ సాధన కోసం కూడా ఐక్యంగా కదలాలని ఆయన పిలుపునిచ్చారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు తెలంగాణ శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపినట్లు ఆయన గుర్తుచేశారు.కేంద్ర ప్రభుత్వం కూడా ఈ బిల్లును ఆమోదించి బీసీలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చిప్ప మోహన్, మల్లప్ప పటేల్,శ్యామప్ప, మొగల గౌడ్, ఇందిరమ్మ, అహ్మద్, బీఆర్‌ఎస్ నాయకుడు విజయ్ దేశాయ్, బీజేపీ మండల అధ్యక్షుడు సుభాష్, ఉపాధ్యక్షుడు ప్రేమ్ సింగ్, నాయకులు తానాజీ, రమేష్, మల్లికార్జున యాదవ్, బోడి రాజు, కుమార్ సింగ్, దేవి సింగ్, రామ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.







