సమన్వయంతో పనిచేసే వారికి పదవులు — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన ధ్యాస,నిజాంసాగర్ (జుక్కల్),కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా డీసీసీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో,నిజాంసాగర్ మండలంలోని నీటిపారుదల శాఖ అతిథి గృహంలో గుల్ గుస్తా లో నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమానికి ఏఐసీసీ అబ్జర్వర్ రాజ్‌పాల్ సింగ్ ఖరోలా హాజరయ్యారు.ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అబ్జర్వర్ రాజ్‌పాల్ సింగ్ ఖరోలాను ఆత్మీయంగా స్వాగతించి,శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ —
కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పార్టీకి కష్టపడే,సామాన్య కార్యకర్తలతో కలసి పనిచేసే నాయకుడినే డీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేయడం జరుగుతుంది.ఈ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుంది అన్నారు.అలాగే పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే ఈ ప్రక్రియ యొక్క ప్రధాన ఉద్దేశమని తెలిపారు. నాయకులు,కార్యకర్తల అభిప్రాయాలు సేకరించి అధిష్ఠానానికి పంపి తుది నిర్ణయం పార్టీ కేంద్ర అధిష్ఠానం తీసుకుంటుందని పేర్కొన్నారు.
గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నాయకత్వాన్ని కార్యకర్తల అభిప్రాయాల ఆధారంగా ఎంపిక చేయడం ద్వారా పార్టీ మరింత బలపడుతుంది అని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో ఎనిమిది మండలాల అధ్యక్షులు మల్లికార్జున్,రవీందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి,హన్మంలు, రమేష్ దేశాయ్, బస్వత్ రాజు పటేల్,పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్,జుక్కల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు అబ్దుల్ ఇమ్రాజ్,గుర్రపు శ్రీనివాస్,అనీస్ పటేల్,తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వడ్డేపల్లి,మల్లూర్,సుల్తాన్ నగర్,వెల్గనూర్ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు.ఈ సందర్భంగా మండల…

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    🔸మొంథ తుఫాన్ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎమ్మెల్యే కాకర్ల..!నియోజకవర్గ పరిధిలోని 8 మండలాల అధికారులు, కూటమి శ్రేణులకు తగు ఆదేశాలు..!పలుచోట్ల వరద బాధితులకు దుప్పట్లు, ఆహార పదార్దాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల..! ఉదయగిరి అక్టోబర్ 28 :(మన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?