మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సింహపురి ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్ ఆధ్వర్యంలో స్థానిక వైద్య బృందం సహకారంతో ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పలువురు అధికారులు, ఉద్యోగులు, స్థానికులు రక్తదానంలో పాల్గొన్నారు. రక్తదానం ద్వారా అనేక ప్రాణాలు రక్షించబడతాయని, ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలలో భాగం కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.శిబిరంలో పాల్గొన్న దాతలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలుపుతూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.









