చిత్తూరు,మనధ్యాస, అక్టోబర్ 2
పూతలపట్టు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే లలితకుమారి ని వైసీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబరుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో అధిష్టానం నియమించింది. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఈ పదవి రావడానికి సహకరించిన అధినేత జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్, జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, పాలేరు రామచంద్రారెడ్డి, ఎంబి కుమార్ రాజా, తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.







