మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ). జిల్లా కేంద్రానికి సరిహద్దుల్లో ఉన్న పత్తి మిల్లులను, సరిహద్దులోని చెక్ పోస్టులను అదనపు కలెక్టర్ వి. విక్టర్ పరిశీలించారు.మద్నూర్ మండలంలోని మంగళవారం అంతరాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటుచేసిన చెకో పోస్టును తనిఖీచేశారు.చెక్ పోస్టు సిబ్బందికి పోలీసులకు సలహాలు,సూచనలు అందజేశారు.రాష్ట్రంలో వరి కోనుగోలు కేంద్రాలు కొనసాగుతున్నాయని. సన్నవడ్లకు 500 బోనస్ ను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నందున ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి సన్న వడ్లు రాకుండా సరిహద్దు వద్ద చెక్ పోస్టును ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.ఇతర రాష్ట్రాల నుంచి వరిధాన్యం రాష్ట్రం లోకి రాకుండా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.అలాగే మద్నూర్ మార్కెట్లో జిన్నింగ్ మిల్లులను పరిశీలించి సం బంధిత జిన్నింగ్ మిల్లు యజమానులతో మాట్లాడారు. మిల్లులో తీసుకుంటున్న జాగ్రత్తలు ఏర్పాట్లను పరిశీలించి రైతులకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసు కోవాలని మార్కెట్ కమిటీ కార్యదర్శిని ఆదేశించారు.అదనపుకలెక్టర్ వెంట తహసీల్దార్ ఎం.డి ముజీబ్, సివిల్ సప్లై నాయబ్ తహసీల్దార్ ఖలీద్, రెవెన్యూ, పోలీస్, మార్కె ట్ కమిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







