ప్రమాదపుటంచన ఊటుకూరు జువ్వు గుంట పాలెం చెరువులు..!మండలంలో 12 చెరువులకు 75% మరో2, చెరువులకు25 శాతం చేరిన నీరు..!చెరువులను పరిశీలించిన, డి ఈ రమణారావు, ఏ ఈ లు శ్రీనివాసులు, మహేంద్ర, మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి..!
వింజమూరు,అక్టోబర్ 29 :మన ధ్యాస న్యూస్)://
వింజమూరు మండలంలో మొంథా తుఫాన్ ప్రభావంతో వింజమూరు మండలం లో ఉన్న 31 చెరువులకు గాను 17 చెరువులు పూర్తిగా నిండినట్లు 12 చెరువులకు 75% నీరు చేరినట్లు, మరో రెండు చెరువులకు 25 శాతం నీరు చేరినట్లు ఇరిగేషన్ డిఈ రమణారావు తెలిపారు. బుధవారం ఇరిగేషన్ డి ఈ రమణారావు, ఏ ఈ లు మహేంద్ర,శ్రీనివాసరావు, మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, తో కలిసి ఏ ఈ మహేంద్ర చెరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఊటుకూరు, జువ్వు గుంట పాలెం చెరువులు, ప్రమాదపుటంచున ఉన్నాయని, జుగుంటపాలెం చెరువు అలుగు సమీపంలో బండ్ల బాట వద్ద నీరు బయటకు వస్తుందన్నారు. యుద్ధ ప్రాతిపదికన చెరువు కట్టకు మరమ్మత్తుల చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఊటుకూరు చెరువు కట్ట బలహీనంగా ఉందని తొమ్మిది లక్షల రూపాయలతో ఎస్టిమేషన్ పంపించడం జరిగిందన్నారు. ప్రస్తుతానికి కట్ట బలహీనంగా ఉన్న ప్రాంతంలో మట్టిని తోలి సదును చేసేందుకు ప్రయత్నం ప్రయత్నం చేస్తామన్నారు. నల్లగొండ బొడ్డు వాగు చెరువు, చంద్రపడియ చెరువు, బుక్కాపురం చెరువు, మలపరాజు వాగు చెరువు, శంఖవరం చెరువు, ఊటుకూరు ఊర చెరువు, తక్కెళ్ళపాడు చెరువు, రావిపాడు పెద్ద చెరువు, కాటేపల్లి పెద్ద చెరువు, తమీద పాడు పెద్ద చెరువు, బాడవ చెరువు, ఇర్ల చెరువు, నల్లగొండ్ల ఊర చెరువు, కాటేపల్లి ఊర చెరువు, రావిపాడు ఊర చెరువు, బత్తిన వారి పల్లి పెద్ద చెరువు, బొమ్మరాజు చెరువులు పూర్తిగా నిండాయన్నారు. ఎర్రబల్లి పాలెం పెద్ద చెరువు, వింజమూరు పాత చెరువు, రామలింగారెడ్డి పెద్ద చెరువు, ఎర్ర చెరువు, అంకాలమ్మ చెరువు గుండె మడగల, ఏకమ్మ చెరువు జువ్వు గుంట పాలెం, మిట్ట చెరువు నంది గుంట, ఏ కిస్తీపురం పెద్ద చెరువు, ఏ కిస్తీపురం గ్రామ చెరువు, నంది గుడి వాగు ఊటుకూరు పెద్ద చెరువు, చింతలపాలెం చెరువు, చాకలి కొండ చెరువులు 75% నిండాయని తెలిపారు. మోట చింతలపాలెం చెరువు, ఓబులమ్మ చెరువులకు 25% నీరు చేరినట్లు ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు. వారి వెంట ఏగినేని శ్రీనివాసులు రైతులు ఉన్నారు.








