మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
పాకాల గ్రామానికి చెందిన వైస్సార్సీపీ నాయకుడు శెట్టి రామలింగయ్య ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతం డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తిరిగి వచ్చిన సందర్భంగా ఆదిమూలపు సురేష్ యువసైన్యం ఆధ్వర్యంలో సింగరాయకొండ మండల వైస్సార్సీపీ అధ్యక్షులు మసనం వెంకట్రావు పరామర్శించారు.ఈ సందర్భంగా రామలింగయ్యకు ఆర్థిక సహాయం అందజేస్తూ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు గోవర్ధన్, పాకాల గ్రామ అధ్యక్షులు కృష్ణారెడ్డి, ప్రభాకర్రెడ్డి, అశోకరెడ్డి, మాధవ, శ్రీను, వినోద్, శానంపూడి కన్వీనర్ శంకర్, యూత్ అధ్యక్షులు వెంకరెడ్డి, విద్యార్థి విభాగం నరేష్, మహిళా అధ్యక్షురాలు భుజమ్మ, వేణు, మురళి, కళ్యాణ్, నాగార్జున, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.









