
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
ఈనెల 17వ తేదీన ప్రారంభమైన పౌష్టికాహార మాసోత్సవాలలో భాగంగా యర్రవరం సచివాలయం 2లో సుపోసిత్ భారత్ సక్షం భారత్ కార్యక్రమాన్ని అంగన్వాడీ సిబ్బంది నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిడిపిఓ పద్మావతి, స్థానిక కూటమి నాయకులు బస్సా ప్రసాద్,మైరాల కనకారావు,గంగిరెడ్ల మణికంఠ హాజరయ్యారు.గర్భవతులు,బాలింతలు తీసుకోవలసిన ఆహారాలపై అవగాహన కల్పించారు.స్థూలకాయ నివారణ,శిశు చిన్న పిల్లల ఆహారపు అలవాట్లు,బాల్య దశ సంరక్షణ,పిల్లల పట్ల పురుషుల భాగ స్వామ్యం,సమన్వయ చర్యలు,సమగ్ర పోషణకు బలమైన అడుగు అనే విషయాలపై అవగాహన కల్పించారు.కిషోర్ బాలికలకు ఆరోగ్య పరీక్షలు,అంగన్వాడీ చిన్నారులతో యోగా కార్యక్రమాలు,చిన్నారులకు అపార్ ఆధార్,అభా కార్డ్స్ వంటి పలు అంశాలను నిర్వహించారు.అనంతరం అంగన్వాడీ విద్యార్థులు తల్లులకు క్విజ్ పోటీ చేపట్టారు.తండ్రులకు ఆడబిడ్డలతో బైక్ పోటీలు నిర్వహించారు.అనంతరం రుచికరమైన వంటలు చేసిన పలువురు తల్లులకు బహుమతులు అందజేశారు.అలాగే అంగన్వాడీ చిన్నారులకి అన్నప్రాసన కార్యక్రమం నాయకులు బస్సా ప్రసాద్,మైరాల కనకారావు చేతుల మీదుగా జరిపించారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ చక్రవేణి,పంచాయతీ కార్యదర్శి వర్మ, అంగన్వాడీ టీచర్లు ఎస్ఎల్ వి నాగమణి,పి అనంత,ఎస్ అమ్మాజీ,పి చంద్రావతి,కె బుజ్జమ్మ, కె కరుణ జ్యోతి,హెల్పర్లుఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.









