
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్
ఏక్ దిన్, ఏక్ గంటా, ఏక్ సాథీ నినాదంతో నగర పంచాయతీ వాసులందరు స్వచ్ఛత వైపు అడుగులు వేయాలని చైర్మన్ పిలుపునిచ్చారు.ఏక్ దిన్-ఏక్ ఘంట-ఏక్ సాథ్ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం ఏలేశ్వరం లో స్వచ్ఛత హీ సేవ స్ఫూర్తితో మున్సిపాలిటీ అధికారులు, పంచాయతీ సెక్రెటరీ,ఇతర అధికారులతో కలిసి శ్రమదానం చేశారు. స్థానిక బాలాజీ చౌక్ సెంటర్ ఆవరణాలను శుభ్రం చేశారు. చెత్తను తొలగించి మానవహరం నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం స్వచ్ఛతా హీ సేవా ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా అలమండ సత్యవతి చలమయ్య మాట్లాడుతూ
స్వచ్ఛతా హీ సేవా స్ఫూర్తితో కనీసం రోజుకో గంటపాటైనా పరిశుభ్రతపై దృష్టి పెట్టాలిన్నారు. స్వచ్ఛత హీ సేవ స్ఫూర్తితో మున్సిపాలిటీ లో అన్ని ప్రదేశాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. మన ఇంటితోపాటు పని చేసే కార్యాలయాల పరిసరాల పరిశుభ్రత కూడా ఎంతో ముఖ్యమన్నారు. మన పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా పాటు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు మానసిక ఆరోగ్యం పొందవచ్చని చైర్మన్ తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ ఏలేశ్వరం5 సాధనకు ప్రతి ఒక్కరు బాధ్యతతో కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ అధికారులు, సచివాలయం సిబ్బంది, డ్వాక్రా యానిమేటర్స్,పారిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు









