
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలం యర్రవరం ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఆరోగ్య శాఖ అధికారులు స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బస్సా ప్రసాద్,మైరాల కనకారావు,గంగిరెడ్ల మణికంఠ హాజరయ్యారు.
ఆరోగ్యకరమైన మహిళలు బలమైన కుటుంబాల కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు.అసంక్రమిత వ్యాధుల కోసం మహిళలకు స్క్రీనింగ్,రక్త పోటు,మధుమేహం,నోటి క్యాన్సర్,రొమ్ము క్యాన్సర్,గర్భాశయ కాన్సర్ మొదలైన వ్యాధులకు నిర్ధారణ పరీక్షల నిర్వహించారు.వ్యాధి సంబంధిత మందులను రోగులకు అందించారు.ఈ సందర్భంగా వైద్యాధికారి వీరన్న,పంచాయతీ కార్యదర్శి వర్మలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాలలో మహిళల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు.అందులో భాగంగానే ప్రతి గ్రామంలో వైద్య సేవలు ఆరోగ్యశాఖ ద్వారా అందిస్తున్నామని తెలిపారు.గ్రామాలలో మహిళలు ఈ వైద్య సేవలను వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం ఎంపీడివో సిహెచ్ రవికుమార్ వర్మ,నాయకులు ఆకుల నాని,తోట హరి,ఆశా వర్కర్లు,వైద్య శాఖ అధికారులు,కన్నబాబు మాస్టర్,తదితరులు పాల్గొన్నారు.









