

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని ఏఐవైఎఫ్ వనపర్తి జిల్లా కార్యదర్శి ఎం డి కుతుబ్ గ్రామ సిపిఐ కార్యదర్శి అంజి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మక్తల్ నియోజక వర్గంలోని అమరచింత మండలం కొంకన్వాని పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరుకు నోచుకోని నిరుపేదలను కలిశారు. నర్వ లక్ష్మి, దేవరపల్లి జయమ్మ, లక్ష్మీ, మహేశ్వరి, కుర్వ రాములమ్మ నివాసముంటున్న పూరి గుడిసెలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని ఎంతో ఆశతో తమ గుడిసెలను సైతం కూల్చి వేసుకున్నామని బాధితులు నాయకులతో వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి తీరా ఇవ్వకుండా వారికి అన్యాయం చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఇండ్లు లేని వాళ్ళను స్వయంగా పరిశీలించి ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అమరచింత ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల ముందు ఆందోళన చేపడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు వెంకట్ రెడ్డి, అంకె రాజు, శ్రీను, కురుమన్న, గొల్ల రాజు పాల్గొన్నారు.