సీతారామపురం అక్టోబర్ 29(మన ధ్యాస న్యూస్)
రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా సీతారామపురంలోని కురవ వీధిలో బండి రోశమ్మ ఇంటి ప్రహరీ గోడ కూలింది మరియు ఇల్లు లోపల గోడ కూడా పాక్షికంగా దెబ్బతిని పడే స్థితిలో ఉన్నదని ఆమె అవేదన వ్యక్తం చేశారు.ఇంచుమించు లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని వాపోతున్నారు మరియు తురకపాలెంలోని షేక్ గౌసియా ఇంటి గోడతో సహా ఒకవైపు రూము మొత్తం రేకులు ఇల్లు కూలిపోయింది.దీంతో వారు తీవ్ర అవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు రెండున్నర లక్షల రూపాయల నష్టం కలిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అదృష్టవశాత్తు ఈ రెండు ప్రమాదాలు జరిగే సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కేవలం ఆస్తి నష్టం మాత్రమే వాటిల్లింది ఎటువంటి ప్రాణం నష్టం లేకపోవటంతో అదికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందించాలని వారు కోరుతున్నారు.ఈ రెండు ప్రమాదాలను స్థానిక తాసిల్దార్ షేక్ ఫజిహా మరియు ఇన్చార్జ్ ఎంపిడిఓ చంద్రశేఖర్ మరియు హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ చెన్నారాయుడు కలిసి పరిశీలించారు. ధైర్యంగా ఉండమని ప్రభుత్వం నుండి సహాయం అందే విధంగా చర్యలు చేపడతామని బాధ్యులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి యువ నాయకులు పసుపులేటి వికాస్ బాబు (విక్కి) మరియు బండి రవీంద్ర పాల్గొని బాధ్యులకు ధైర్యం చెప్పి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టికి తీసుకువెళ్లి అండగా ఉంటామని భరోసా కలిగించారు. ఈ కార్యక్రమంలో విఆర్వోలు మనోహర్, ఖాజామోహిద్దీన్ పాల్గొన్నారు.







