మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:
సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు, బిస్కెట్లు పంపిణీ చేసిన శ్రీమతి కాకాణి పూజిత.
కాకాణి పూజితమ్మ వెంట పాల్గొన్న మాజీ జెడ్పిటిసి సభ్యులు మందల వెంకట శేషయ్య యాదవ్, పొదలకూరు మండల బూత్ కమిటీ కన్వీనర్ బత్తల సురేష్ కుమార్ రెడ్డి, వైయస్సార్సీపీ నాయకులు మందల పెంచలయ్య,తదితరులు. ఈ సందర్భంగా కాకాణి పూజితమ్మ మీడియాతో మాట్లాడుతూ……….భారీ వర్షాల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను మా తండ్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కి తోడుగా, నేను కూడా సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రజలను నేరుగా కలుసుకొని, కష్టసుఖాలను తెలుసుకుంటున్నాం అని అన్నారు.పేదల కోసం ఎండకు, వానకు ఇబ్బందులు పడకుండా జగన్మోహన్ రెడ్డి ఇళ్ల స్థలాలు అందించి, ఇళ్లు నిర్మించి, ప్రతి గ్రామంలో జగనన్న కాలనీలను ఏర్పాటు చేశారు అని అన్నారు.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, నేడు తుఫాను లాంటి విపత్కర పరిస్థితులలో ప్రజలకు ఉపయోగపడుతున్నాయి అని అన్నారు.జగనన్న ఏం చేశారని మాట్లాడే వారికి నేడు ప్రజలకు ఉపయోగపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి అని అన్నారు. జగనన్న హయంలో నిర్మించి, పేదలు నివసిస్తున్న జగనన్న కాలనీలలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కనీస మౌలిక వసతులు కల్పించలేక పోతుంది అని అన్నారు. పేదలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం జగనన్న కాలనీలను పూర్తిగా విస్మరించింది అని అన్నారు.కూటమి ప్రభుత్వంలో జగనన్న కాలనీలలో నివసించే వారిని పట్టించుకునే నాధుడే కరువయ్యాడు అని అన్నారు.కూటమి నేతలు అధికారం ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులపై కక్ష సాధింపులకు పాల్పడటం దారుణం అని అన్నారు.ప్రజలను కాపాడాల్సిన పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమాజానికి మంచిది కాదు అని అన్నారు.
అధికారం ఉన్నా, లేకున్నా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది అని అన్నారు. జగనన్న ఆదేశాలతో తుఫాను సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రజలకు అవసరమైన సేవలందించడం అభినందనీయం అని అన్నారు.-భారీ వర్షాలలో ప్రజలకు అండగా నిలిచి, సహాయ సహకారాలు అందించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అధికారులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.







