

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : పేకాట స్థానంపై దాడి చేసి నలుగురు వ్యక్తులను పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగిందని కృష్ణ ఎస్సై నవీద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సిబ్బందితో కలిసి గురజాల గ్రామ శివారులోని కృష్ణా రైల్వే స్టేషన్ సమీపంలో శరణప్ప వ్యవసాయ పొలంలో పేకాట ఆడుతున్న స్థావరం పై దాడి చేయడం జరిగిందని అన్నారు.1 గుల్బర్గా కు చెందిన రాజు, 2, హిందూపూర్ గ్రామానికీ చెందిన పసుపులనర్సింగ్ ,3 యాద్గిర్ కు చెందిన ఎండి యోనుస్ 4 ఊట్కూరు మండలానికి చెందిన ఎండి రియాజ్ ల పై కేసు నమోదు చేయడం జరిగిందని అన్నారు. వీరి నుండి 30,550 రూపాయలను స్వాధీన పరచుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.