

Mana News, March 7, 2025: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు. కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, ఉత్తరాయనం, శిశిర రుతువు, శుక్ల పక్షం .తిధి: అష్టమి ఉదయం గం.9.18 ని.ల వరకు ఆ తర్వాత నవమి . నక్షత్రం: మృగశిర రాత్రి గం.11.32 ని.ల వరకు ఆ తర్వాత ఆరుద్ర . అమృతఘడియలు: మధ్యాహ్నం గం.2.56 ని.ల నుంచి గం.4.30 ని.ల వరకు, వర్జ్యం: లేదు , దుర్ముహూర్తం: ఉదయం గం.8.53 ని.ల నుంచి గం. 9.41 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.12.51 ని.ల నుంచి గం.1.39 ని.ల వరకు , రాహుకాలం: ఉదయం గం.10.30 ని.ల నుంచి గం.12.00 గం.ల వరకు , సూర్యోదయం: తె.వా. గం. 6.30 ని.లకు, సూర్యాస్తమయం: సా. గం. 6.24 ని.లకు ,మేషం :- అగ్రిమెంట్లు కుదుర్చుకోవడానికి అనుకూలమైన రోజిది. అన్ని రకాల లబ్దిని పొందుతారు. సోదరులు తోడుగా నిలుస్తారు. వృత్తిపర నైపుణ్యాలతో బాగా రాణిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆత్మధైర్యం పెరుగుతుంది. వృషభం :- మనసులోని భావాన్ని స్పష్టంగా వ్యక్తం చేయాలి. నోటిదరుసును తగ్గించుకోవాలి. బ్యాంకు లావాదేవీలు పెద్దగా తృప్తినివ్వవు. కుటుంబ వ్యవహారాలపై దృష్టి పెట్టాలి. ఇతరుల వల్ల ఇబ్బందులుంటాయి. ఖర్చు తగ్గించాలి. మిథునం :- ఉన్నత స్థాయికి ఎదగాలన్న ప్రయత్నాలకు మద్దతు లభిస్తుంది. వాస్తవ పరిస్థితులను అంచనా వేసుకుంటూ సాగాలి. అదృష్టం కలిసొస్తుంది. మనోధైర్యం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. విందుకు హాజరవుతారు. కర్కాటకం :- ఇంటికి దూరంగా ఒంటరిగా గడిపే సూచన ఉంది. పనులు ఆశించినట్లు సాగవు. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి. బంధువుల వైద్యం కోసం ఖర్చు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. సింహం :- ఆనందంగా గడుపుతారు. వ్యవహారాల్లో లబ్దిని పొందుతారు. మీ ప్రయత్నాలకు తగిన సపోర్ట్ అందుతుంది. కొత్త స్నేహాలు లాభిస్తాయి. కీలక ఆకాంక్ష నెరవేరుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. శత్రుపీడ తగ్గుతుంది. కన్య :- నైపుణ్యానికి తగినంత గుర్తింపు లభిస్తుంది. వ్యవహారాలన్నీ శుభప్రదంగా సాగుతాయి. ఉన్నత స్థాయిలోని వారు అండగా నిలుస్తారు. కొత్త బాధ్యతలను స్వీకరించే సూచనలు ఉన్నాయి. పోటీల్లో విజేతలుగా నిలుస్తారు. తుల :- పనులు అనుకున్నట్లుగా సాగవు. అశాంతి పెరుగుతుంది. దూర ప్రయాణం సూచిస్తోంది. ఖర్చు తగ్గించాలి. అనవసరంగా పరిహారం చెల్లించాల్సి వస్తుంది. కడుపులో ఇబ్బందిగా ఉంటుంది. భవిష్యత్‌పై బెంగ ఉంటుంది. వృశ్చికం :- బలహీనతలే దెబ్బ తీస్తాయి. అనవసరంగా పోటీల్లో పాల్గొనకండి. ఆస్తి వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. పెద్దల కోపానికి గురవుతారు. వేళకు భోజనముండదు. ప్రత్యర్థుల బెడద ఉంటుంది. అజీర్తి సమస్య ఉంటుంది. ధనుస్సు :- ధనలాభముంది. బంధాలు బలపడతాయి. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది.విజ్ఞానాన్ని పెంచుకునేందుకు అనువైన సమయమిది. ప్రయాణ ప్రయోజనం సిద్ధిస్తుంది. మకరం :- అభీష్టం నెరవేరుతుంది. వ్యవహారాల్లో శుభ ఫలితాలను పొందుతారు. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. కీర్తి పెరుగుతుంది. వివాదం పరిష్కారమవుతుంది. అనుబంధాలు పెరుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుంభం :- బద్ధకం వదిలిపెట్టాలి. ఇష్ట కార్యం చెడిపోయే సూచన ఉంది. తెలివితేటలకు తగిన గుర్తింపు ఉండదు. విశ్లేషణలు పనికి రావు. ఖర్చులు పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసర గొడవలు వస్తాయి. మీనం :- ఆలోచనల తీరును మార్చుకోవాలి. వాహన సంబంధ సమస్య గోచరిస్తోంది. స్థిరాస్తి, విద్యా రంగాల్లోని వారు జాగ్రత్తగా ఉండాలి. బుద్ధి నిలకడగా లేక బంధువులతో గొడవలకు దిగుతారు. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
