

ప్రజా శ్రేయస్సు దృష్ట్యా కుబేర హోమం.
భక్తులతో కిటకిటలాడిన దేవస్థానం.
ఉరవకొండ మన న్యూస్:పట్టణంలోని పదో వార్డులో స్వయంభువుగా వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి, ఇరువురు దేవేరులతో భక్తులు కళ్యాణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
అభిజిత్ లగ్నమందు మధ్యాహ్నం12.15 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామికి, శ్రీదేవి భూదేవిలతో కళ్యాణం అంగరంగ వైభవంగా భక్తులు జరిపించారు.
దేవస్థానంలో ఉదయం 9 గంటలకు స్వామివారి మూలవిరాట్ కు సుప్రభాత సేవలు, అభిషేక పూజలు జరిపించారు. శ్రీ లక్ష్మీ గణేశ హోమం, శ్రీ లక్ష్మీ నారాయణ హోమం, వరుణ యాగాలు నిర్వహించారు. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా కుబేర హోమం జరిపించారు. 10. 30 నిమిషాలకు పూర్ణాహుతినిచ్చారు.
సరియగు అభిజిత్ లగ్నంలో 12..15 గంటలకు శ్రీవారికి ఇరువురి దేవేరులతో కళ్యాణం జరిపించారు. భక్తులు అమ్మవారికి స్వామివారికి కానుకలు చదివించారు అనంతరం దేవస్థాన ఆవరణంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, కమిటీ సభ్యులు రాఘవేంద్ర, ఇతరులు డాక్టర్ శైలజ దంపతులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.