బండ్ల గణేష్ కు ఘన సన్మానం, ఆయనతో నడక సాగించిన ఎమ్మెల్యే..
తిరుమల, ఫిబ్రవరి 10,మన న్యూస్,(నాగరాజు కె)
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం బండ్ల గణేష్ తలపెట్టిన పాదయాత్ర సోమవారం తిరుమలకు చేరుకుంది. ఈ పాదయాత్రలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొన్నారు. బండ్ల గణేష్ గారిని ముందుగా శాలువాతో ఘనంగా సన్మానించారు.అనంతరం ఆయన పాదయాత్రకు సంఘీభావంగా ఆయనతో కలిసి నడిచారు.బండ్ల గణేష్ పాదయాత్ర విజయవంతంగా పూర్తి కావడంతో సంతోషం వ్యక్తం చేశారు.శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఆశీర్వదించారు.అనంతరం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శ్రీవారిని దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో సహచర ఎమ్మెల్యేలు,టిడిపి నేతలు, అభిమానులు తదితరులు ఉన్నారు.
