

Mana News :- తిరుమలలో తెలంగాణ భక్తులకు మళ్లీ నిరాశే ఎదురైంది. మంత్రులు, ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్దామనుకున్న వారి లేఖలను టీటీడీ స్వీకరించడం లేదు.ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఇలా చేయడం ఏంటని భక్తులు మండిపడుతున్నారు. కేవలం తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధుల లేఖలే తీసుకోవడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై టీటీడీ ఇంకా స్పందించలేదు.
