ఉదయగిరి, ఫిబ్రవరి 11,మన న్యూస్,(నాగరాజు కె )

ఉదయగిరిలోని మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళాశాల నందు వ్యవసాయ విద్యార్థులు బుధవారం నాడు తమ అనుభవపూర్వక విద్యలో భాగంగా పండించిన పోషకపరమైన, పకృతి పరమైన కందిపప్పు అలసందలు మరియు మినుములను కళాశాల ప్రాంగణం ఎదుట విక్రయిస్తూ మీడియా కంట పడ్డారు. ఈ సందర్భంగా విలేకరులు విద్యార్థులతో మాట్లాడగా తాము పండించిన అలసంద (టిపిటిఈ 29) మరియు మినుములు (టిబిజి 129) పూర్తిగా మంచి వ్యవసాయ పద్ధతులను పాటించి పండించడం జరిగిందని ఈ పప్పు దినుసులతో ప్రోటీన్ మరియు ఇతర పోషక విలువలు ఎక్కువగా కలిగి ఉన్నాయని వారు తెలిపారు.ఈ ప్రాంతంలో సంవత్సరానికి ఒకసారి పొగాకు పంటను అత్యధికంగా ఎక్కువ విస్తీర్థములో సాగు చేస్తారని.. కానీ అలసంద మరియు మినుము పంటల సాగువలన రైతులకు అధిక ఆదాయంతో ఆరు తడి పంటలు భూసారాన్ని పెంచుతాయని ఇంత గొప్ప అనుభవాన్ని ఇలాంటి ప్రదేశంలో కూడా కలిగించినందుకు తమ అధ్యాపకులకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా డాక్టర్ ఎం సునీత,కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ గోపికృష్ణ, అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బందికి విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *