
ఏలేశ్వరం పట్టణంలో స్థానిక మార్స్ కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మరియు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ అధినేత అడపా దుర్గారావు తల్లి సత్యవతి 9వ వర్ధంతి సందర్భంగా,ఆమె జ్ఞాపకార్థం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక స్వామి దయానంద సరస్వతి అనాధ ఆశ్రమానికి 25 కేజీలు బియ్యం,కూరగాయలు, నిత్యావసర సరుకులు ఆశ్రమ ఇంచార్జ్ శేఖర్ కు అందజేయడం జరిగింది.స్థానిక శివాలయం వద్ద పేదలకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది.చేపట్టడం తనకు ఎంతో సంతోషం మరియు సంతృప్తిని కలగ చేస్తుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో కోరాడ రాజు,గోళ్ళ విజయ్ కుమార్,మద్దుల స్వరూప్,గంపా చరణ్ తేజ్,గంపా అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.