సంపన్నులు సమాజ సేవలో భాగస్వాములు కావాలి…….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస,ఇందుకూరుపేట ,అక్టోబర్ 17:ప్రజాసేవ చేసేందుకే రాజకీయాలలోకి వచ్చామని సంపన్నులు సమాజ సేవలో భాగస్వామ్యం కావాలన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . ఇందుకూరు పేట మండల కేంద్రంలోని కమ్యూనిటి హెల్త్ సెంటర్ లో శుక్రవారం మధ్యాహ్నం రెడ్డి ల్యాబ్స్ వారు అందచేసిన ఫిజియోధెరఫి, డెంటల్ యప్రిడియాట్రిక్ తదితర విభాగాలకు సంబంధించి 40 లక్షల విలువ చేసే మెడికల్ ఎక్విప్మెంట్స్ ఆమె ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ……. ఇందుకూరు పేట ప్రభుత్వ హాస్పిటల్ కు అత్యాధునిక వైద్య పరికరాలు అందచేసిన రెడ్డి ల్యాబ్స్ సంస్థకు ఆమె ధన్యవాదాలు తెలియచేసారు. కోవూరు నియోజకవర్గ అభివృద్ధికి రెడ్డి ల్యాబ్స్ సంస్థ సహకరించాలని ఆ సంస్థ ప్రతినిధులను కోరారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందాక కోవూరు నియోజకవర్గంలో విపిఆర్ ఫౌండేషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్యాన్సర్ పరీక్షల గురించి ప్రస్తావించారు. విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో విపిఆర్ నేత్ర అనే బృహత్తర కార్యక్రమాన్ని తలపెట్టామన్నారు. ఉదయగిరి నుంచి ప్రారంభించి తదుపరి కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తామని అవసరమైతే కళ్ళకు సంబంధించిన శస్త్ర చికిత్సలు చేయిస్తామన్నారు. విపిఆర్ నేత్ర పేరిట నిర్వహిస్తున్న ఉచిత కంటి పరీక్షల శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తీర ప్రాంతమైన మైపాడు పరిసర గ్రామాల మత్స్యకారుల వైద్య సేవల కోసం శిథిలావస్థకు చేరిన మైపాడు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎంపి వేమిరెడ్డి గారి సహకారంతో 3 కోట్ల 50 లక్షల సి ఎస్ ఆర్ నిధులతో త్వరలోనే ఆధునీకరణ పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వెల్లడించారు. ఇందుకూరు పేట ప్రభుత్వ ఆసుపత్రిలోని అత్యాధునిక వైద్య సదుపాయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ జయలక్ష్మి, ఎమ్మార్వో గోపి కృష్ణ, ఎంపీడీవో నాగేంద్ర బాబు, ఇందుకూరుపేట సిహెచ్సి సూపర్ ఇండెంట్ సునీల్ కుమార్,ఇందుకూరు పేట టిడిపి అధ్యక్షులు ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, రావిళ్ళ వీరేందర్ నాయుడు, కోడూరు కమలాకర్ రెడ్డి, చెంచు కిషోర్ యాదవ్, దేవిరెడ్డి రవీంద్రారెడ్డి, సూదలగుంట నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: ‎రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!