జీఎస్టీ సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలి……….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస ,ఇందుకూరుపేట ,అక్టోబర్ 17:జిఎస్టి 2.0 సంస్కరణలతో పన్నుల విధానాన్ని సులభతరమై ప్రజలకు ప్రత్యక్ష లాభాలుపెరిగి వ్యాపారులపై పన్నుల భారాన్ని తగ్గిందన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ఇందుకూరు పేట మండల కేంద్రంలో ఆమె వ్యాపారస్థులు మరియు రైతులకు జిఎస్టి 2.0 ప్రయోజనాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ….. ట్రాక్టర్ల పై 12 శాతం వున్న జిఎస్టి 5 శాతానికి తగ్గడంతో వ్యవసాయ రంగానికి ఎంతో మేలు జరిగిందన్నారు. హార్వెస్టర్, రోటావేటర్ లాంటి వ్యవసాయ పరికరాలు, ఫర్టిలైజర్సు మరియు పురుగు మందులపై గతంలో 12 నుంచి 18 శాతం వున్న జీఎస్టీ యిప్పుడు 5 శాతానికి తగ్గడంతో రైంతాంగం హర్షం వ్యక్తం చేస్తుందన్నారు. రొయ్యల సాగుకు అవసరమైన డీజిల్‌ ఇంజన్లు, ఏరియేటర్లు, స్పింక్లర్ల పై 12 శాతం వున్న జీఎస్టీ 5 శాతానికి తగ్గిందన్నారు. చేపల, రొయ్యల చెరువుల్లో నీటి నాణ్యతకు ఉపయోగించే అమ్మోనియా వంటి రసాయనాలు ఇతర మినరల్స్ పై వున్న 12 శాతం జిఎస్టిని 5 శాతానికి తగ్గించి ఆక్వా రంగానికి అండగా నిలిచారన్నారు. ఆక్వా కల్చర్‌ కు చెందిన చాలా ఇన్‌పుట్స్‌ పై 12 వున్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించి ఆక్వా రంగాన్ని ఆదుకున్న ప్రధాని మోడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు ఆమె ధన్యవాదాలు తెలియ చేశారు. ఉప్పు, పప్పు, సబ్బులు, షాంపూలు, పేస్టులు తదితర నిత్యావసర సరకుల ధరలు తగ్గడంతో పేద, మధ్య తరగతి వర్గాల నెల వారి బడ్జెట్ లో నెలకు 3 నుంచి 5 వేల రూపాయలు అదా అవుతాయన్నారు. జిఎస్టి 2.0 సంస్కరణల ద్వారా సమాజంలోని ప్రతి వర్గానికి మేలు జరిగిందన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . జడ్పీ వైస్ చైర్మన్ విజయ లక్ష్మీ, జీఎస్టీ కావలి జోన్ అధికారి జ్యోతి, తహసీల్దారు గోపి కృష్ణ, ఎంపీడీవో నాగేంద్ర, ఇందుకూరుపేట టిడిపి అధ్యక్షులు పవన్ కుమార్ రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, రావెళ్ల వీరేంద్ర నాయుడు, చెంచు కిషోర్ యాదవ్, దేవిరెడ్డి. రవీంద్ర రెడ్డి, సూదలగుంట నాగార్జున, బాబు, బీజేపీ నాయకులు కైలాసం శ్రీనివాసులు రెడ్డి, జనసేన నాయకులు గుడి. హరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: ‎రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!