బీసీలకు రిజర్వేషన్ బీఎస్పీ తోనే సాధ్యం

  • బీసీ రిజర్వేషన్ పెంచాలంటూ నినాదాలతో దద్దరిల్లిన కాకినాడ కలెక్టర్…

మనన్యూస్ కాకినాడ కలెక్టరేట్ (అపురూప్) బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టర్ కార్యాలయం బహుజన నినాదాలతో బీసీలకు 52 శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ నినాదాలతో దద్దరిల్లింది. కాకినాడ జిల్లా కలెక్టర్ కి రోడ్డుపై బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు బీసీ సంఘం నాయకులు వినత పత్రం సమర్పించారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల ప్రకారం కాకినాడ జిల్లాలో బీసీలకు 52 శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాత సుబ్రహ్మణ్యం (సుబ్బు భాయ్) ఆధ్వర్యంలో బీసీ సంఘాలను బీసీ నాయకులను కలుపుకొని బీసీ సమరభేరి పేరుతో కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీసీల తరఫునుంచి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పంపన రామకృష్ణ బాధ్యత తీసుకోగా బీసీ సంఘ నాయకులు చోల్లంగి వేణుగోపాల్ బహుజన నాయకులు అయినవిల్లి నారాయణ గౌడ్, బీసీ కులాల అధ్యక్షులు మాకినీడు భాస్కరరావు, బీసీ సంఘ నాయకులు పప్పు దుర్గా రమేష్, సామాజిక న్యాయ సాధన సమితి అధ్యక్షులు కోరుకొండ భానుమతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు, బీఎస్పీ నాయకులు మాట్లాడుతూ, అత్యధిక జనాభా కలిగిన బీసీలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని, బీసీలు మొనగాడ సాధిస్తారని ఓర్వలేక కులగణన చేయడం లేదని మండిపడ్డారు. బహుజనుల అభివృద్ధికి తోడ్పడిన పార్టీలకు మాత్రమే మద్దతిస్తామని బీసీలకు రిజర్వేషన్ బిఎస్పి పార్టీతోనే సాధ్యమని, రాష్ట్రస్థాయిలో బహుజనుల పార్టీ అయిన బీఎస్పీ ద్వారా బిసి రిజర్వేషన్ సాధిస్తామని అన్నారు. దళిత సంఘ నాయకులు పండు అశోక్ కుమార్ తోటి చెంగల్ రావు పాల్గొనగా బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా కమిటీ ముఖ్య పాత్ర పోషించగా అన్ని నియోజకవర్గాల ఇన్చార్జిలు అధ్యక్షులు ఆయ నియోజకవర్గాల కార్యకర్తలు నాయకులతో ధర్నా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఇన్చార్జ్ సబ్బారాపు అప్పారావు కాకినాడ జిల్లా జనరల్ సెక్రెటరీ కండవల్లి లోవరాజు బివిఎఫ్ జిల్లా కన్వీనర్ ప్రత్తిపాటి బుల్లి రాజు, జిల్లా ట్రెజరర్ సాధనాల రాజు, ప్రత్తిపాడు నియోజకవర్గ అధ్యక్షులు అపురూప్, కొంగు రమేష్ బత్తిన తాతాజీ, గునపర్తి రాఘవ, కాకినాడ సిటీ అధ్యక్షులు బుంగ చక్రవర్తి కాకినాడ జిల్లాలోని ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!