• ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి…

మన న్యూస్ శంఖవరం (అపురూప్): ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ అధికారి పి గాంధీ రైతులకు సూచించారు. కత్తిపూడిలో రైతులతో వరి కోతలను ,నూర్పిడిలను పరిశీలించి సూచనలు ఇచ్చారు .ధాన్యం నాణ్యతా ప్రమాణాలను అనుసరించి మద్దతు ధరలకు ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని వివరించారు. వరి సాధారణ రకం క్వింటాకు 2300 రూపాయలు, ఎ- గ్రేడ్ రకం క్వింటాకు 2320 రూపాయలకు రైతుల వద్దనుండి కొనుగోలు చేయడం జరుగుతుంది అని వివరించారు. ప్రస్తుత వాతావరణం వరి కోతలకు అనుకూలంగా లేనందున కోతలు వాయిదా వేయాలని సూచించారు. శంఖవరం, కొంతంగి ,కత్తిపూడిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు.రైతులకు వేసవి అపరాల సాగు ప్రాముఖ్యత,నవధాన్యాల సాగు వంటి అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయకులు ప్రభాస్,మణికంఠ,రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *