

Mana News :- జీడి నెల్లూరు నియోజక వర్గం, వెదురుకుప్పం మండలం, నచ్చుకూరు గ్రామంలో ఆదివారం ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేకం కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మహా మంగళ హారతి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.