

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: నగర పంచాయతీ లో పిచ్చికుక్క స్వైర విహారం చేయడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆదివారం స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ వెనక వీధిలో లో ఓ పిచ్చి కుక్క దాడి చేసి 11 మంది పై దాడి చేసి కాట్లు వేసింది. పిచ్చికుక్క దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. బాధితులను స్థానికులు స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం కి తీసుకెళ్లారు. వైద్యులు వారందరికీ ఏఆర్వో ఇంజక్షన్ చేశారు. వీధి కుక్కలు, పిచ్చి కుక్కల సంఖ్య పెరిగిపోయిందని, కనిపించిన వాళ్లపై కుక్కలు దాడి చేసి కరిచేస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. కుక్కల నివారణకోసం నగర పంచాయతీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.