

Mana News :- గంగాధర నెల్లూరు పర్యటనలో వైసీపీపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరైనది కాదని ఆదివారం మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. వైసీపీ వాళ్లకు ఏ పనులు చేసినా ప్రజాప్రతినిధులు, అధికారులపై చర్యలు తీసుకుంటాను అనడంపై మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం కుల, మతాలకు అతీతంగా అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలను అందించిందని ఆయన అన్నారు. నవరత్నాలు అమలు చేసినప్పుడు డిబిటి ద్వారా ఆ పథకాలు మీకు రాలేదా అని ప్రశ్నించారు.