 
									 
కలిగిరి, అక్టోబర్ 30 :(మన ద్యాస న్యూస్):///
కొండాపురం మార్గంలో తెల్లపాడు క్రాస్ రోడ్డు సమీపంలోని విద్యుత్ ఉపకేంద్రం ఎదుట ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బాబు–మమత దంపతుల తో పాటు ఒక కుమార్తె దుగ్గి దుర్మరణం పాలయ్యారు. ఒక కుమార్తె తీవ్రంగా గాయపడిన ఈ విషాదకర ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.ఈ ఘటనపై స్పందించిన మాజీ ఎమ్మెల్యేలు బొల్లినేని వెంకట రామారావు మరియు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి బాధిత కుటుంబాన్ని స్వయంగా పరామర్శించారు. వారి కుటుంబానికి పార్టీ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వారు రూ.50,000 ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు.ఈ ప్రమాదం తనను తీవ్రంగా కలిచివేసిందని బొల్లినేని వెంకట రామారావు పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన చిన్నారిని చూసి ఆయన చలించి పోయారు ఆమెకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆమె వైద్య ఖర్చులకు తన వంతు సాయం అందించామన్నారు.మానవీయతతో ముందుకు వచ్చి బాధిత కుటుంబానికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.







