మన ధ్యాస, నిజాంసాగర్ 🙁 జుక్కల్ ) నిజాంసాగర్ మాజీ జడ్పీటీసీ కృష్ణారెడ్డి నిబద్దతతో పని చేసి ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప రాజకీయ దురందరుడు అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. నిజాంసాగర్ మాజీ జడ్పీటీసీ మల్లూరు కృష్ణారెడ్డి గురువారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోని మల్లూరు కృష్ణారెడ్డి నివాస గృహంలో కృష్ణారెడ్డి భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శోకసంద్రంలో మునిగిన కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ఓదార్చారు. అనంతరం అంత్యక్రియలలో పాల్గొని పాడె మోసి అశృనయనాలతో వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కృష్ణారెడ్డి బాన్సువాడ సమితి అధ్యక్షునిగా, నిజాంసాగర్ జడ్పీటీసీగా నిబద్ధతో పనిచేశారని, ప్రజా సేవకే తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకుడు అంటూ ఎమ్మెల్యే భావోద్వేగానికి గురయ్యారు. పార్టీకి వారు అందించిన సేవలు మరువలేనివి అని, ఒక బలమైన నాయకుడిని కోల్పోవడం పార్టీ శ్రేణులకు దుఃఖాన్ని కలిగిస్తున్నదని, వారి లేని లోటు తీర్చలేనిది అన్నారు. కృష్ణా రెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినా, వారు అందించిన సేవల రూపంలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నిజాంసాగర్ మండలం అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, వెంకటరామిరెడ్డి, కిష్టారెడ్డి, మాజీ పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, ప్రతాప్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రజా పండరి, వీరారెడ్డి, విట్టల్ రెడ్డి పాల్గొన్నారు.






