మన ధ్యాస ,నిజాంసాగర్, ( జుక్కల్ ) భారత దేశ ఐక్యతకు ప్రతీక సర్దార్ వల్లభాయ్ పటేల్ అని బిచ్కుంద సీఐ రవికుమార్, ఎస్ ఐ మోహన్ రెడ్డి అన్నారు. జుక్కల్ నియోజకవర్గం లోని బిచ్కుంద ,నిజాంసాగర్ మండలాల్లో జాతీయ ఏకతా దినోత్సవం సందర్భంగా భారత దేశ ఐక్యతకు ప్రతీకైన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదినోత్సవంను పురస్కరించుకొని బిచ్కుంద,నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ ఎస్ ఐ శివకుమార్ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తా నుంచి కందర్ పల్లి చౌరస్తా వరకు జరిగిన పనులు పరుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… భారతదేశ ప్రథమ హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. జాతీయ ఐక్యత దినోత్సవం ఉద్దేశం దేశ పౌరులందరికీ ఐక్యత శాంతి సోదరభావాన్ని పెంపొందించడం కోసమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది యువకులు పాల్గొన్నారు.