తవణంపల్లి అక్టోబర్ 31 మన ధ్యాస
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం మత్యం జోగివారిపల్లి గ్రామంలో వెలసిన శ్రీరుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి దేవాలయం జీర్ణోద్దారణ కుంభాభిషేఖ మహోత్సవం నవంబర్ 1వతేది నుండి 2వ తేదీ ఆదివారం వరకు వేడుకగా నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.శనివారం స్వామి అమ్మవార్ల ఊరేగింపు,కలశ పూజ,యజ్ఞయాగాలు,తీర్థప్రసాదాలు అందించబడునని ఆదివారం స్వామి అమ్మవార్ల ప్రాణప్రతిష్ఠ హోమం,గో పూజ,స్వామివారి కల్యాణోత్సవం,అన్నదాన కార్యక్రమం నిర్వహించబడునని గ్రామస్తులు తెలిపారు.కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కాగలరని కోరారు.
