ఉదయగిరి ఎమ్మెల్యే సురేష్ మార్గదర్శకత్వంలో వరద బాధితులకు తక్షణ సహాయం..!కొండాపురం, కలిగిరి మండలాల్లో తుఫాను బాధితులకు అండగా నిలిచిన స్థానిక నాయకులు..!మొంథా తుఫాన్: ఉదయగిరి నియోజకవర్గంలో ప్రజలకు అండగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
కలిగిరి అక్టోబర్ 29 :(మన ధ్యాస న్యూస్)://

అక్టోబర్ 28 మంగళవారం నాడు తుఫాను “మొంథా” ప్రభావంతో ఇటీవల జిల్లాలో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.ఆ ఆదేశాల మేరకు స్థానిక నాయకులు ముందుకు వచ్చి, కొండాపురం మండలంలోని చింతలదీవి ఎస్సీ కాలనీ, సాయిపేట పంచాయతీకి చెందిన కొమ్మిపాలెం గ్రామం, అలాగే కలిగిరి మండలంలోని వెంకన్నపాలెం ఎస్టీ కాలనీ మరియు రావులకొల్లు గ్రామంలోని ఎస్టీ కాలనీల్లో తుఫాను ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న వరద బాధిత కుటుంబాలకు సహాయక చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా వారు బాధితులకు దుప్పట్లు, తినుబండారాలు, కూరగాయలు, ముఖ్య ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో తగిన చర్యలు తీసుకుంటూ, అవసరమైన సహాయాన్ని అందజేశారు.ప్రజల సంక్షేమమే ముఖ్యమని భావించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ప్రతీ గ్రామంలోనూ పరిస్థితులను నిశితంగా గమనిస్తూ, అవసరమైతే తక్షణ సహాయం అందేలా అధికారులను సూచించారు.







