మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి, మర్పల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ఐకెపి ఏపీఎం ప్రసన్న రాణి,ఏఈఓ స్వర్ణలతతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రసన్న రాణి మాట్లాడుతూ..ఇప్పటివరకు 20 మంది రైతుల ఖాతాలలో 20,38,294 రూపాయలు జమ చేయబడ్డాయని తెలిపారు.రైతులు కేంద్రాల వద్ద సౌకర్యాలను సమర్ధంగా వినియోగించుకోవాలని, ధాన్యం తూకం తర్వాత డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయని తెలిపారు.ఏపిఎం వెంట సిసి సాయిలు, బ్రాహ్మణపల్లి గ్రామ అధ్యక్షులు చిరంజీవీ,తదితరులు ఉన్నారు.






