కనిగిరి అక్టోబర్ 31 మన ధ్యాస న్యూస్ ://
కనిగిరి నియోజకవర్గం తూర్పు కోడిగుడ్లపాడు గ్రామపంచాయతీ పరిధిలోని జంగాల పల్లె వాస్తవ్యులు చెనికల వెంకటేశ్వరరావు చెంచులక్ష్మి దంపతుల కుమార్తె శ్రావణి, బాలే బోయిన మాలకొండ రాయుడు తిరుపతమ్మ దంపతుల కుమారుడు ప్రవీణ్ కుమార్ ల నిశ్చితార్థం వేడుకలు విజయవాడలోని సుందర కమల నిలయంలో శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ నిశ్చితార్థం వేడుకల్లో కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ పాల్గొని ప్రవీణ్ కుమార్, శ్రావణి లకు అభినందనలు తెలిపారు.ఈ నిశ్చితార్థం వేడుకల్లో తూర్పు కోడిగుడ్లపాడు మాజీ ఎంపీటీసీ చెనికల పెదమాల కొండయ్య, చెనికల మాల కొండయ్య (కరణం) చెనికల చినమాల కొండయ్య (బొజ్జయ్య) చెనికల నాగేశ్వరరావు, మానం మల్లికార్జున రావు, కిరణ్, బొడ్డు సుధాకర్, రవి, చెనికల రామయ్య, మానం రత్తయ్య, చెనికల వారి కుటుంబ సభ్యులు, బాలే బోయిన వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.







