మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ ) అక్టోబర్ 22 ,మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో జాతీయ ఆహార భద్రతా పోషణ మిషన్(NFSNM) ద్వారా రైతులకు రాయితీపై శనగ విత్తనాలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు రైతులకు అందజేశారు.అనంతరం రైతు వేదికలో ఎమ్మెల్యే మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల సంక్షేమం కోసమే పని చేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు కుటుంబం నుండి వచ్చిన నాయకుడు అని చెప్పారు.
ప్రజా ప్రభుత్వం అన్నదాతలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని,వ్యవసాయానికి అగ్రతాంబూలం అందిస్తుందని తెలిపారు.కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సదుపాయలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజు,మండల తహసీల్దార్ ఎండి ముజీబ్,సీనియర్ నాయకులు సాయి పటేల్,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేశ్ పటేల్, మద్నూర్ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్,మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్లు స్వామి, కొండ గంగాధర్, మద్నూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శివాజీ రాథోడ్,తదితరులు ఉన్నారు







