శ్రీవాణి ట్రస్టు ద్వారా నిధులను సమకూర్చి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం..!మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
దుత్తలూరు అక్టోబర్ 22 :(మన ధ్యాస న్యూస్):///
ఉదయగిరి నియోజకవర్గం లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నర్రవాడ వెంగమాంబ పేరంటాలు తల్లి సేవలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ తరించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు అయ్యారు.

ఈ సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కొండ వద్ద శ్రీ వెంగమాంబ తల్లి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే అక్కడ పర్యాటకులను ఆకట్టుకునే విధంగా చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలను మ్యాప్ ద్వారా పరిశీలించారు. అభివృద్ధికి అవసరమైన నిధులను తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్టు ద్వారా సమకూర్చేందుకు కృషి చేస్తానని మంత్రి ఆనం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వింజమూరు మండలం గుండె మడగల గ్రామంలో కోటి రూపాయలతో సీతారామాంజనేయ ఆలయ నిర్మాణానికి మంత్రితో కలిసి భూమి పూజ నిర్వహించినట్లు తెలిపారు. ఉదయగిరి నియోజకవర్గాన్ని పర్యాటక కేంద్రంగా చేసేందుకు కృషి చేస్తున్నామని అందులో భాగంగా మొదటి అడుగు వెంగమాంబ తల్లి ఆలయం నుండి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. నర్రవాడ వెంగమాంబ ఆలయం ఉదయగిరి లోని ఉదయగిరి కోట రంగనాయకుల దేవాలయం, ఘటిక సిద్దేశ్వరం దేవాలయాలను కలుపుతూ టూరిజం డెవలప్మెంట్ చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

మంత్రి ఆనం సహకారం మరువలేనిది అని, దేవాదాయ శాఖ మంత్రి మన నెల్లూరు వాసి కావడం అదృష్టమన్నారు. బ్రహ్మోత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే ప్రణాళికలు రచించి, ఆ విధంగా ముందుకు వెళ్లి, భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, మల్లంపాటి గురవయ్య నాయుడు, గిరి నాయుడు, ఆలయ ఈవో శ్రీనివాసులు రెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి, ఉండేలా గురువారెడ్డి, ఆంజనేయులు రెడ్డి,ఇతర నాయకులు తదితరులు ఉన్నారు.







