దగదర్తి, అక్టోబర్ 20:(మన ధ్యాస న్యూస్://
రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు అంత్యక్రియలు ఈ రోజు ఆయన స్వగ్రామమైన దగదర్తిలో అధికారిక లాంఛనాలతో నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమంలో ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు పాల్గొన్నారు. ఆయన మాలేపాటి పార్థివ దేహానికి పుష్పాంజలి అర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇలాంటి విషాదకరమైన వార్త వినాల్సివస్తుందనుకోలేదు. ఎంతో ఆత్మీయంగా ఉండే కుటుంబసభ్యుడిని కోల్పోయా. తెలుగుదేశం పార్టీ దగదర్తి మండల అధ్యక్షుడిగా, కావలి నియోజకవర్గ ఇన్ చార్జిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆయన అందించిన సేవలు ఎనలేనివి. పార్టీ కోసం క్రమశిక్షణతో పనిచేయడమే గాక కపటం లేని నాయకుడిగా గుర్తింపు పొందారు,” అని ఆయన అన్నారు.అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో, సంప్రదాయబద్ధంగా నిర్వహించబడ్డాయి. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొని మాలేపాటి కి చివరి వీడ్కోలు పలికారు.








